![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -963 లో... రాహుల్, రేఖ ఇంట్లో నుండి బయటకు వెళ్ళడానికి బ్యాగ్ తో కిందకి వస్తారు. ఎక్కడికి అని రాజ్ అడుగుతాడు. ఇంట్లో నుండి వెళ్ళిపోతాం రాజ్.. మా మమ్మీ చేసిన పనికి మేం మీ ముందు ఉండలేమని రాహుల్ అంటాడు.
స్వప్న నువ్వు నాతో పాటురా అని రాహుల్ అనగానే.. ఎక్కడికిరా వెళ్ళేది తప్పు చేసింది తను మీరు కాదని రాజ్ అంటాడు. తప్పుకి శిక్ష అనుభవిస్తుందని ఇందిరాదేవి అంటుంది. ముగ్గురు అక్కా చెల్లెల్లు ఒక దగ్గర ఉండాలని అనుకున్నాం.. ఇప్పుడు మమ్మల్ని విడదియ్యకు రాహుల్ అని కావ్య అంటుంది. ఎక్కడికి వెళ్ళేది లేదని రాజ్ వాళ్ళని లోపలికి వెళ్ళమంటాడు.
ఆ తర్వాత ట్రస్ట్ బాధ్యతలు పూర్తయ్యాక ఇద్దరి పిల్లలకి బారసాల, ఆ తర్వాత శ్రీశైలం వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటారు. మరొకవైపు మన ప్లాన్ లు అన్ని వాళ్ళకి సక్సెస్ అవుతున్నాయని రుద్రాణితో రేఖ అంటుంది. ఇప్పుడు వాళ్ళు ట్రస్ట్ మొదలు పెడుతున్నారు. బారసాల చేస్తున్నారు. అందరు కలిసి శ్రీశైలం ట్రిప్ కి కూడా ప్లాన్ చేసారని రేఖ చెప్తుంది. మంచి న్యూస్ చెప్పావ్ వాళ్ళు అందరు వెళ్లే వెహికల్ లో బాంబ్ పెట్టిస్తాను. ఎవరికి డౌట్ రాకుండా స్వప్నని, రేఖని తీసుకొని నువ్వు వేరే వెహికల్ లో వెళ్ళమని రాహుల్ కి రుద్రాణి చెప్తుంది. దాంతో రాహుల్ సరే అంటాడు.

ఆ తర్వాత రాత్రి కావ్య తన బిడ్డని పట్టుకొని ముద్దాడుతుంటే.. నా కూతురు పుట్టాక నన్ను పట్టించుకోవడం లేదు.. నాకు ఒక్క ముద్దు కూడా ఇవ్వడం లేదని కావ్యతో రాజ్ అంటాడు. దాంతో రాజ్ కి కావ్య ముద్దు ఇస్తుంది.
మరుసటి రోజు దుగ్గిరాల ట్రస్ట్ ఏర్పాట్లు పూర్తవుతాయి. అప్పుడే మినిస్టర్ తనతో పాటు ఒకరిని తీసుకొని వస్తారు. ట్రస్ట్ బాధ్యతలు వీళ్ళు చూసుకుంటారని రాజ్ ఇంట్లో వాళ్లకు చెప్తాడు. మన ఫ్యామిలీ తరపున అయితే కావ్య చూసుకుంటుందని రాజ్ చెప్పగానే అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు.
తరువాయి భాగంలో రుద్రాణి అనుకున్నట్లుగానే అందరు వెళ్లే వెహికల్ లో బాంబ్ పెడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |